![]() |
![]() |

చవకగా ఏదొచ్చిన తీసుకుందామనునే జనాలు సమాజంలో చాలానే ఉన్నారు. అయితే వారిలో బిగ్ బాస్ బ్యూటీ రతికరోజ్ కూడా ఉండటం గమనార్హం. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐ ఫోన్ ఫ్రీ అంటే ఒక్క ఫోన్ కాదు.. ఏకంగా వంద ఐఫోన్లు.. ఫోన్ అంటే అల్లాటప్పా మోడల్ కాదు.. ఏకంగా ఐఫోన్ 15 ఫోన్లను ఫ్రీగా ఇస్తానని 'నా అన్వేషణ' యూట్యూబ్ ఛానెల్ 'ఆటగాడు' చెప్పాడు. 167 దేశాలకు పైగా చొట్టొచ్చిన ప్రపంచ యాత్రికుడికి ‘ఆటగాడి’గా పెద్ద పేరే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలికి చెందిన ఆ ఆటగాడు.. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతున్నారంటే మనోడి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. నెలకి మనోడి సంపాదన కోట్ల రూపాయలను దాటేసింది. నా అన్వేషణ (Naa Anveshana Youtube Channel) యూట్యూబ్ ఛానల్లో ఇతనికి 300 మిలియన్ వ్యూస్‌తో పాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ల మంద ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో నా అన్వేషణ యూట్యూబర్ ఎలాంటి వీడియో పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కాస్తో కూస్తో ఫాలోవర్స్ వచ్చారంటే.. వాళ్లంతా ఆదాయం కోసం బెట్టింగ్ యాప్‌లను ఇతరత్రా అన్ అఫీషియల్ ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేస్తుంటారు. అయితే తనకి కోట్లలో ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.. ‘నా అన్వేషణ’ యూట్యూబర్ మాత్రం ఇలాంటి వాటిని ప్రోత్సహించడు.
కాగా నా అన్వేషణ యూట్యూబర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఆఫర్ ప్రకటించాడు. 100 ఐఫోన్లను తన ఫాలోవర్స్‌ని పంచుతున్నానంటూ వీడియో వదిలాడు. ఐఫోన్ అంటే అదేదో అల్లాటప్పా కాదు.. ఐఫోన్ 15 అంటూ మోడల్ పేరు కూడా చెప్పాడు అవినాష్. వంద ఐ ఫోన్లను మీకు ఇవ్వబోతున్నాను.. రండి బాబూ రండి.. చవక చవక.. నేను ఐఫోన్ కంపెనీకి ప్రచారం చేయడం లేదు కానీ.. జస్ట్ వాళ్లు నా ఫొటోతో పాటు చవక చవక అనే డైలాగ్‌ని వాడుకుంటానన్నారు.. అందుకు గానూ నాకు 100 ఐ ఫోన్లు ఇస్తానని అన్నారు. ఇదేదో బాగుంది ఎలాగూ నేను కొని మీకు ఇవ్వలేను. అంతా సవక బ్యాచ్. కాబట్టి మీరు చేయాల్సింది.. ఈ వీడియో కింద కామెంట్ చేస్తే.. లాటరీ ద్వారా వంద ఐఫోన్లను అందిస్తాను. వచ్చే వారం ఇదే టైమ్ కి మీ పేర్లను లాటరీ ద్వారా అనౌన్స్ చేసి మీకు ఐఫోన్లను అందిస్తానని వీడియో పెట్టాడు నా అన్వేషణ యూట్యూబర్. మనోడు అలా వీడియో పెట్టాడో లేదో.. దాదాపు 20 దేశాల నుంచి కామెంట్ల మోత మోగింది. ఒక్క రోజులో 1 మిలియన్ కామెంట్లు వచ్చాయి. ఫ్రీగా ఐఫోన్ ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు.. సో.. వివిధ అకౌంట్ల నుంచి కామెంట్లు మోత మోగింది. అయితే వీళ్లలో సెలబ్రిటీలు కూడా ఉండటంతో విశేషం. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా రెండుసార్లు హౌస్‌లోకి వెళ్లిన రతిక రోజ్ సైతం.. ‘నా అన్వేషణ’ యూట్యూబర్ కామెంట్ పెట్టడం కాదు.. ఏకంగా లవ్ సింబల్స్ పెట్టింది. ఒక కామెంట్ పెడితే చూస్తాడో లేదో అనుకుందో ఏమో కానీ.. రతికా అని లవ్ సింబల్‌తో పాటు నా అన్వేషణ అంటూ లవ్ సింబల్స్ పంపించింది. ఫ్రీగా వస్తే కామన్ ఆడియన్స్ నుండి సెలబ్రిటీల దాకా కావాలనుకుంటారు. అయితే ఇలా చేయడం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది.
![]() |
![]() |